BREAKING
భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం జోరు వానలోనూ తగ్గని జోరు.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. ఆనందపురం జడ్పీటీసీకి చతుర్ముఖ పోరు...!! బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు.... కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం చిత్తూరు మండలంలో టిడిపి ఇంటింటి ప్రచారం - ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ * ఉపాధి హామీ పనిదినాలను125 నుంచి 225 రోజులకు పెంచాలి వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి ఏఐవైఫ్ నేటితో పరిషత్‌ ఎన్నికల ప్రచారానికి తెర.. * జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ * ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రన్నాయుడు సేవలు చిరస్మరణీయం

పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి

Select Suryaa Now
పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి

పాలమూరు మేజర్ న్యూస్-

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ కోరారు.
పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగం, విద్యా రంగ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ విధానాలపై శాసనమండలిలో తమ గొంతుక వినిపించేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ వ్యవస్థ ఒక ముఖ్యమైన వేదిక అని పేర్కొన్నారు.
అయితే చాలా మంది డిగ్రీ పూర్తి చేసినప్పటికీ పట్టభద్రుల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడం లేదని, దీనివల్ల తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని అన్నారు.
కాబట్టి డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం ప్రకటించిన అర్హతలు, గడువులను పరిశీలించి పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా యువత, మహిళా పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న పట్టభద్రులు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు..

ఎం.ఓం ప్రకాష్..పాలమూరు