నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో వస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఇట్లు అర్జున’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల తన కొత్త నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 4వ తేదీన ‘ఇట్లు అర్జున’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో హీరో అనీష్ కారు నడుపుతూ సీరియస్‌గా కనిపిస్తుండగా, పక్కనే ఉన్న అనస్వర రాజన్ టెన్షన్‌తో ఉండటం సినిమాలోని ఉత్కంఠను తెలియజేస్తోంది. పగిలిపోయిన కారు అద్దం, గాల్లో ఎగురుతున్న గాజు ముక్కలు మరియు వారిని వెంబడిస్తున్న వ్యక్తుల నేపధ్యం కథపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో అర్జున్ అనే మూగ యువకుడు తన జీవితంలో కీర్తిని మౌనంగా ప్రేమించే పాత్రలో నటిస్తున్నారు. తన మనసులోని భావాలను మాటల ద్వారా వ్యక్తపరచలేకపోయే ఒక యువకుడి ప్రయాణం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. ప్రేమ, హాస్యం, సాహసం మరియు ఊహించని ట్విస్టుల కలయికగా ఈ సినిమా సాగనుంది. ఈ చిత్రంతో రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా పరిచయం అవుతుండగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.