BREAKING
భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం జోరు వానలోనూ తగ్గని జోరు.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. ఆనందపురం జడ్పీటీసీకి చతుర్ముఖ పోరు...!! బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు.... కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం చిత్తూరు మండలంలో టిడిపి ఇంటింటి ప్రచారం - ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ * ఉపాధి హామీ పనిదినాలను125 నుంచి 225 రోజులకు పెంచాలి వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి ఏఐవైఫ్ నేటితో పరిషత్‌ ఎన్నికల ప్రచారానికి తెర.. * జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ * ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రన్నాయుడు సేవలు చిరస్మరణీయం

డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి

Select Suryaa Now
డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి
సూర్య ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం కొమరం భీమ్ చౌరస్తాలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ల పై సమగ్రంగా విచారణ చేపట్టి అనర్హులను తొలగించి, అర్హులైన వారికి ఇండ్లు కేటాయించాలని పలువురు బాధితులు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు సునకారి రాజేశ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పంపకాలు చేసే క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరిని ఎంపిక చేశారని అన్నారు. అందులో నుండి అనర్హులను తొలగించాలని పలుమార్లు విన్నవించిన, అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. నిరుపేదలు అద్దెలు  చెల్లించలేని స్థితిలో మరియు తినడానికి తిండిలేనటువంటి పరిస్థితి పలువురికి ఉందన్నారు. అటువంటి పేదలకు డబల్ బెడ్ రూములు ఇవ్వకుండా అనర్హులకు కేటాయించారని, వెంటనే అధికారులు అనర్హులను తొలగించి అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని అన్నారు. ఇందులో ఐఎఫ్టియు
జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం లింగన్న, డబల్ బెడ్రూంల సాధన కమిటీ కన్వీనర్ తోటరాద , కో కన్వీనర్ షేక్ గౌస్, మసీద్, షాదుల్లా, లక్ష్మి గీత ,రుక్మ ,కమల, గంగోత్రి ఇతరులు ఉన్నారు.