POలు, APOలకు పోలింగ్ విధులపై అవగాహన శిక్షణ
వెల్దుర్తి, మేజర్ న్యూస్ :మండల పరిధిలో జరగనున్న MPTC / ZPTC ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల (APO) కు ప్రత్యేకావగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రైనర్లు, అధికారులు డిజిటల్ స్క్రీన్ల (Smart Display) ద్వారా పోలింగ్ రోజున పాటించాల్సిన నియమావళి, ఓటింగ్ ప్రక్రియ, ప్రాసెస్ షీట్లు, పోలింగ్ మెటీరియల్ నిర్వహణ మరియు సీలింగ్ విధానాలపై సమగ్రంగా వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ ప్రక్రియను నిష్పాక్షికంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా పూర్తి చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న POలు మరియు APOలు అధికారుల సూచనలను శ్రద్ధగా వింటూ, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నికల సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.