కటకం కుమారస్వామి, సెగ్మెంట్లో ప్రచారం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగవ సెగ్మెంట్లో కూటమి పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కటకం కుమారస్వామి సోమవారం విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వెంటరాగా ఇంటింటికి తిరిగి 5వ తేదీ జరగబోయే ఎన్నికలలో ఎంపీటీసీగా తనకు, జడ్పిటిసి గా పోటీ చేస్తున్న నక్క శ్రీనివాసరావుకు సైకిల్ గుర్తుల పై ఓటు వేసి గెలిపించవలసిందిగా కుమారస్వామి ఓటర్ల ను అభ్యర్థించారు. ప్రచారంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.