ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కు పకడ్బందీ ఏర్పాట్లు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్*
కర్నూలు, నవంబర్ 02:- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
సోమవారం నగర శివారులోని అథేనా పాఠశాలలో కర్నూలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల పరిసర ప్రాంతాలన్నింటినీ నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలను అమర్చడం జరిగిందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల లోపల అవసరమైన అన్ని మౌలిక వసతులను సిద్ధం చేశామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావారణంలో ముగించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు..
కార్యక్రమంలో మున్సిపల్ ఎస్ఈ , డిఈ లు తదితరులు పాల్గొన్నారు