telangana
బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు
సూర్య బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని పి ఏ సి ఎస్ సొసైటీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని ఆర్టీ ఐ కార్యకర్త ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సొసైటీలో 900 మంది పేర్లతో అక్రమ రుణాలు, ఇతరుల పట్టాలపై రుణాలు తీసుకున్నారని, 1983 నుంచి 2026 వరకు సొసైటీకి సంబంధించిన రికార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆర్టీ ఐ ద్వారా అడిగినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ కు వినతిపత్రం అందజేశారు.