BREAKING
ఏఐ రంగంలో హెచ్చుతగ్గులు మరియు యూఎస్ టెక్ స్టాక్స్ ట్రెండ్ నవంబర్ 20న థియేటర్లలోకి ‘డానీ’: ఇది ఒక కల్ట్, వైల్డ్ డ్రామా అంటున్న హీరో ఆశిష్ గాంధీ! డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్!

రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన

Select Suryaa Now
రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన

గాజువాక, సూర్య : ఉపాధి కోసం రష్యా వెళ్లిన గాజువాక మండలం దువ్వాడ సమీపంలోని జేఎన్‌ఆర్‌యూఎం కాలనీకి చెందిన జెట్టి వంశీ, ఉక్రెయిన్‌తో జరుగుతున్న భీకర యుద్ధ రంగంలో చిక్కుకుని ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కుటుంబ భారాన్ని మోసేందుకు వెళ్లిన కొడుకు మోసపోయి, రష్యన్ ఆర్మీ బలవంతపు యుద్ధానికి బలైపోతుండడంతో ఆ తల్లి అప్పలకొండ పడుతున్న ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వాస్తవానికి ఫ్రూట్స్ ప్యాకింగ్ పని కోసమని వెళ్లిన వంశీని అక్కడి ఏజెంట్లు నట్టేట ముంచి వదిలేయడంతో, నిస్సహాయ స్థితిలో ఉన్న అతడిని నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆర్మీలో చేర్చాడు. తీరా అక్కడికి వెళ్లాక కళ్ల ముందే తోటి స్నేహితుడు కనిపించకుండా పోవడం, బలవంతంగా యుద్ధం చేయిస్తుండటంతో వంశీ తల్లడిల్లిపోయాడు.

"ఇది నా చివరి వీడియో.. ఇండియాకి నేను తిరిగి రాలేను.. యుద్ధానికి వెళ్లనంటే బలవంతంగా వ్యాన్లలో ఎత్తుకెళ్లి పడేస్తున్నారు" అంటూ తన స్నేహితుడు సతీశ్‌తో కలిసి సోషల్ మీడియా ద్వారా తల్లికి పంపిన కంటతడి పెట్టించే వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తమతో పాటు వచ్చిన ఐదుగురిలో ప్రస్తుతం తాను, సతీశ్ మాత్రమే మిగిలామని వంశీ తల్లికి ఫోన్ చేసి వాపోయాడు. భర్త లేక, ఒక ఆడపిల్ల, ఒక బాబుతో జీవనం సాగిస్తున్న తన బాధను అర్థం చేసుకుని ఆదుకోవాలని తల్లి అప్పలకొండ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రష్యా ఆర్మీ బారిన పడిన తన కుమారుడు వంశీని రక్షించి క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను ఆమె కన్నీటి పర్యంతమవుతూ ప్రాధేయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వంశీని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని స్థానికులు సైతం కోరుతున్నారు.