BREAKING
డీసీపల్లిలో వైసీపీ విస్తృత ప్రచారం భారత్ - పోలాండ్ ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం.. కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడి వేసవిలో నిర్మల్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు : ఎన్నికల్లో విజయం సంతోషదాయకం - ఇక ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యం - యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి మౌంట్ ఎవరెస్ట్ సమీపంలో హెలికాప్టర్ల ఢీకొనడంతో భారతీయ పర్యాటకుడి మృతి గౌడ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బోల్గం రవీందర్ గౌడ్ సింగరేణిలో గైర్హాజరుతో డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం నేపాల్ కొత్త భారత రాయబారిగా సుధాకర్ దలేలా బాధ్యతలు ఆత్మకూరు మున్సిపాలిటీలో సత్తా చాటిన జనసేన శ్రీధర్ కళ్యాణలక్ష్మితో ఆర్థిక భరోసా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యo ప్రజాధనంలో ప్రతి రూపాయికి లెక్క ఉండాలి.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటన డాక్టర్ డూమ్ హవా.. అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి ఐదు కొత్త పోస్టర్లు విడుదల! రైతు అభివృద్ధి,సంక్షేమానికి ఏఎంసి లు  పాటుపడాలి. నెల్లూరు కార్పొరేషన్‌లో స్వతంత్రుల సత్తా.. రెండు డివిజన్లలో విజయకేతనం! అయ్యవారిపల్లి భూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి

గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా

Select Suryaa Now
గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా

సూర్య, లక్షెట్టిపేట: గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. స్థానిక డీఈ సూచనల మేరకు ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను విన్నవించారు.ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య మాట్లాడుతూ, సకాలంలో సాగునీరు అందక క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గూడెం లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. నీటి విడుదలలో నిర్లక్ష్యం వహిస్తే అన్నదాతల పక్షాన పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, కిసాన్ మోర్చా పట్టణ, మండల అధ్యక్షులు బుద్దే సత్తన్న, బొల్లారం రవి, మండల ప్రధాన కార్యదర్శులు బొక్కెనపల్లి సతీష్, మంద రాజేందర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంబడి సురేందర్, జిల్లా కార్యదర్శి కేతిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు తగరపు గంగన్న పాల్గొన్నారు. అలాగే శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు ముత్తినేని మల్లేష్, దుమ్మని సత్తయ్య, మల్యాల రమేష్, కాండ్రపు వంశీ, కోన చంద్రశేఖర్, ముష్కం గంగన్న, గుర్రం శ్రీపాల్ రెడ్డి, తనుగుల కిరణ్, పాంచాల రమేష్‌లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.