ఆత్మకూరు మున్సిపాలిటీలో సత్తా చాటిన జనసేన శ్రీధర్
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో జనసేన జిల్లా సీనియర్ నాయకుడు నలిశెట్టి శ్రీధర్ తన సత్తా చాటారు.రెండు వార్డులను కూటమి ఆధ్వర్యంలో మరో రెండు వార్డులను స్వతహాగా గెలిపించుకొని రికార్డు సృష్టించారు. కూటమి భాగస్వామ్యంలో తగినంతగా సీట్లు కేటాయించలేదన్న కారణంగా జనసేన తరఫున అభ్యర్థులను పోటీకి నిలిపారు. ఐదు చోట్ల జనసేన అభ్యర్థులను వార్డులో పోటీకి నిలుపుగా ముగ్గురు జనసేన అభ్యర్థులుగా, ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. 11వ వార్డులో ముక్కోణ పోటీలో జనసేన అభ్యర్థిగా కొలగాని శిరీష ను పోటీకి నిలిపారు. అత్యంత ప్రతిష్టాత్మక ప్రచారాన్ని నిర్వహించి ఆమె ఘన విజయం సాధించేలా శ్రీధర్ ప్రత్యేకంగా కృషి చేశాడు. సఫలీకృతులయ్యారు. ఒకటో వార్డులో కూటమి ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కొమరగిరి శాంత కుమార్ విజయం సాధించారు. ఆరో వార్డులో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి పద్మజ 120 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి షేక్ ఖాజా మస్తాన్ పై విజయం సాధించారు. 11వ వార్డులో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కొలగాని శిరీష 106 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి కొలగాని ప్రశాంతపై ఘన విజయం సాధించారు. 12వ వార్డులో జనసేనకు సంబంధించిన గడ్డం సంధ్య ఇండిపెండెంట్గా పోటీ చేసి 39 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గడ్డం అమరావతి పై విజయం సాధించారు. 8 వార్డుల్లో అభ్యర్థులను జనసేన తరఫున శ్రీధర్ పోటీ చేయించారు.ఇద్దరు నామినేషన్లు చెల్లకపోగా ఒక రు నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఐదు చోట్ల పోటీలో ఉండగా నాలుగు చోట్ల విజయం సాధించడంలో నలిశెట్టి శ్రీధర్ అత్యంత పకడ్ బందీగా,పటిష్టంగా, చాకచక్యంగా ప్రచారం నిర్వహించి విజయం సాధించి తన సత్తా చాటారు. వారు విజయం సాధించగానే నలిశెట్టి శ్రీధర్ను విజయం సాధించిన అభ్యర్థులు కొలగాని శిరీష, శాంత కుమార్,కత్తి పద్మజ, గడ్డం సంధ్యాలను జనసేన నాయకులు కార్యకర్తలు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రజలు అభినందనలతో ముంచెత్తారు.