BREAKING
పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి... పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక!! ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు పూర్తి

నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Select Suryaa Now
నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

పాలకొండ, సూర్య : నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు సర్వం సిద్ధం చేసినట్లు కమీషనర్ పివి నూకరాజు తెలిపారు. సోమవారం కౌంటింగ్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. మొత్తం 28 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి, నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి రౌండ్లో ఏడు టేబుళ్ల చొప్పున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి రౌండ్లో 1, 5, 9, 13, 17, 21, 25 నంబర్ల టేబుళ్లపై, రెండో రౌండ్లో 2, 6, 10, 14, 18, 22, 26 నంబర్ల టేబుళ్లపై లెక్కింపు జరుగుతుంది. మూడో రౌండ్లో 3, 7, 11, 15, 19, 23, 27 నంబర్ల టేబుళ్లపై, నాలుగో రౌండ్లో 4, 8, 12, 16, 20, 24, 28 నంబర్ల టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయిన అనంతరం అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలను ప్రకటించి, విజేతలను అధికారికంగా వెల్లడించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో కౌంటింగ్ ఏర్పాట్లను తహసీల్దార్ రాదా కృష్ణ మూర్తి పరీశీలించారు.