BREAKING
పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు* బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట *డా.వి.జె.ఇ.కారోలిన్ కు ఇండియన్ గ్లోరీ అవార్డ్* 28 ఏళ్ల సుదీర్ఘ సాహస యాత్ర పూర్తి...గూటికి చేరిన బ్రిటన్ అడ్వెంచరర్ కార్ల్ బుష్బీ అమిత్ షా పాదయాత్రలో పాల్గొన్న సైదాబాద్ మాజీ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి గల్ఫ్ దేశాల్లో మళ్లీ మొదలైన యుద్ధ భయాలు

కూటమి లో లొల్లి...

Select Suryaa Now
కూటమి లో లొల్లి...

విజయనగరం, సూర్య : కూటమి లొల్లి తారాస్థాయికి చేరింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో బీజేపీ, టీడీపి నాయకులు మధ్య పొత్తు కుదరక రోడ్డెక్కి కుమ్ములాడుకుంటున్నారు. పూసపాటి రేగ మండలం రెల్లివలసకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్  సోమవారం నేరుగా జిల్లా కేంద్రంలో అశోక్ బంగ్లా ఎదుట ధర్నా చేయడం కూటమిలో సయోధ్య  ఎలా ఉందో  స్పష్టం అవుతుంది. పతి వాడ రాజేష్  ఎంపీ టీసీ గా పోటీ చేస్తుండగా బీజేపీ పార్టీ బి ఫారంకూడా ఇచ్చింది..అయితే ఇది సహించని టీడీపీ మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటిసి, మాజీ ఎమ్మెల్యే కుమారుడు తనను విత్ డ్రా అయ్యిపోవాలని లేదంటే నీ అంతు చూస్తాం...ఊరిలో ఎలా తిరుగుతావో చూస్తామని బెదిరిస్తున్నారని దీనిపై  ఇరు పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగినన్నారు. ఆదివారం టీడీపి జిల్లా అధ్యక్షులు, ఎంపీ వచ్చి మాట్లాడుతామని చెబితే సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆఖరి నిమిషం లో టీడీపీ నాయకులు సూసైడ్ చేసుకుంటామని వారిని కూడా బెదిరించడంతో సమావేశాన్ని వాయిదా వేశారన్నారు. ఇక రెండు రోజుల్లో ఎన్నికలు ఉండడంతో ఇక చేసేది లేక ఇలా ధర్నా చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కూటమిలో రెబల్ గా ఉన్న వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.