కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*
సూర్య అశ్వరావుపేట,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో సోమవారం రోజున కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన యోధుల అమరవీరుల సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ కంగాల కల్లయ్య అధ్యక్షతన వహించారు.
కావడిగుండ్ల గ్రామంలోని కామ్రేడ్ చింతా ముత్తయ్య (పుల్లన్న) స్తూపం వద్ద *సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్* *(ప్రజాపంథా) రాష్ట్ర* *నాయకులు కెచ్చెల* *రంగారెడ్డి పాల్గొని* *అమరవీరుల* *ఆశయ సాధన కోసం* *ఎర్రజెండాను* *ఆవిష్కరించారు.*
ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం *పోరాటం:* భారత కమ్యూనిస్టు విప్లవోద్యమంలో 1969 నుంచి నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలలో విప్లవోద్యమం కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించారని, వారందరూ రాజ్య హింసకు నేలరాలిన అరుణ తారలని వక్తలు కొనియాడారు. భారత విప్లవోద్యమంలో ప్రముఖ నాయకులైన దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, సత్యనారాయణ సింగ్, కాను సన్యాల్, చారు మజుందార్ తదితరులు వివిధ మార్గాలలో విప్లవోద్యమం కోసం కృషి చేసి తమ జీవితాలను అంకితం చేశారని గుర్తుచేశారు.
*అమరవీరుల త్యాగాలు:* శ్రీకాకుళ ఉద్యమంలో పంచాది కృష్ణమూర్తి, నిర్మల, ఆదిభట్ల కైలాసం, చాగంటి భాస్కరరావు, దేవినేని మల్లికార్జున్, సుబ్బారావు పాణిగ్రహి, రమేష్ చంద్ర సాహూ నుంచి పైల వాసుదేవరావు, చంద్రమ్మ, జయమ్మ, కుమార్ తదితరులు ప్రాణాలర్పించారని తెలిపారు. గోదావరి లోయ విప్లవోద్యమంలో తొలి అమరులు కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, వెంకన్నల నుంచి ఆరంభించి... రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ, దొరన్న, ధర్మన్న, బాటన్న, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్, ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కుమార్, నారాయణ, జానకిరామ్ రెడ్డి, కాచనాపల్లి అమరవీరులు, కోటన్న, సీతారామారావు, సుసేన, చింతలక్ష్మీ, నోముల పరశురాములు, మాధవ్ అన్న, విక్రమ్ అన్న, ఎల్లన్న, మురళి, పగడాల వెంకన్న, ముస్మి అమరవీరులు, గణేష్, ఏనుగు అప్పయ్య, సీతక్క, గడ్డం వెంకట నరసమ్మ, రాయల చంద్రశేఖర్, యాదన్నలను స్మరించుకున్నారు.
*అశ్వారావుపేట మండల ప్రాంతాలలో* చింతాముత్తయ్య (పుల్లన్న), కోర్సా పోతప్ప (ధర్మన్న), పెనుబల్లి బజర్, ధర్ముల మల్లయ్య లాంటి ఎందరో ప్రజల కోసం, ప్రజా ఉద్యమం కోసం తమ ప్రాణాలను ధారపోశారని వారు కొనియాడారు.
*పాల్గొన్న ప్రముఖులు:*
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, కావడిగుండ్ల సర్పంచ్ బాడిస లక్ష్మణ్ రావు, పార్టీ గ్రామ నాయకులు కంగాల భూలక్ష్మి, కంగాల కన్నయ్య, వాసం పోతురాజు, సోడెం పౌల్ రాజు, కంగాల వెంకటేష్,జోడె కృష్ణ, తెల్లం సత్యం, ఈధర మోహన్ రావు, ఆకుల బాబురావు, ఆకుల రాంబాబు,ఆకుల రాజు, కొమరం లక్ష్మణ్ రావు, కంగాల సైదమ్మ కొమరం చిన్న లక్ష్మి, బన్నీ పార్వతి, మడివి వెంకటలక్ష్మి,ఉపసర్పంచ్ మడకం మంగరాజు, మడకం దుర్గారావు, మడకం కృష్ణ, మడకం జోగరావు, జోడె లక్ష్ముడు,సోడెం లక్ష్ము, మడకం ముత్యాలరావు, కుంజా సింగరాజు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట