ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన
అనంతపురం విద్య, మేజర్ న్యూస్ :-ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (ఏ)లో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో మిషన్ లైఫ్‌లో భాగంగా బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో రెండో రోజు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బందికి డెస్క్ యోగా నిర్వహించడంతో పాటు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు. అనవసర విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, శక్తి పొదుపు పద్ధతులను దైనందిన జీవితంలో పాటించాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. పద్మశ్రీ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, అధ్యాపకులను అభినందించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..