ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
పొన్నూరు మేజర్ న్యూస్ :- రాష్ట్రం లో కూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను అంతం చేయాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి బుద్ధి చెప్పాలని పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయ కర్త అంబటి మురళి క్రిష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. అంబటి మురళి క్రిష్ణ ప్రచారంలో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థి గనిపిశెట్టి కుసుమకుమారి జెడ్పీటీసీ అభ్యర్థి మురిమెళ్ళ చంద్రిక ల తో కలిసి పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ప్రజాస్వామ్య విలువను కాపడాలని కోరారు. కూటమి నేత లకు బుద్ధి వచ్చే ల చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో 1250/- రూ ఉండవలసిన బియ్యం బస్తా కూటమి ప్రభుత్వంలో 2200/- రు కు చేరింది పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై చేస్తున్న దాడులు, అక్రమ కేసులు బనాయించి రాష్ట్రాన్ని రావణకాష్టం గా మార్చిందని అంబటి మురళీకృష్ణ ధ్వజమెత్తారు. అడ్డదారుల్లో అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించడందుర్మార్గమైన చర్య అన్నారు . పై స్థాయి నాయకుల నుంచి క్రింది స్థాయి కేడర్ వరకూ ఇలా రాష్ట్రాన్ని, ప్రజా సంపదను దోచేస్తూ అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వ్యవహరిస్తే కనీసం మానవతావిలువలు కాపాడిన వ్యక్తులుగా నిలుస్తారని లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఫ్యాను గుర్తుకు ఓటేసి తమ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్