BREAKING
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుందుర్పి లో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు 'గురురాజ' విద్యార్థి ఎంపిక

పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత

Select Suryaa Now
పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత

 

సూర్య - పెద్దపల్లి : ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా పేదలకు సరఫరా చేసే సన్నబియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని సాగర్‌ రోడ్డులో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో ఆరు క్వింటాళ్ల పీడీఎస్‌ సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కె. శ్రీనాథ్‌ ఆధ్వర్యంలో అధికారులు ఇంటి నంబర్‌ 3-3-136/A/1లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌ సన్నబియ్యాన్ని ప్యాకింగ్‌ బ్యాగుల్లో నింపుతున్న బజ్జూరి శంకర్‌ను గుర్తించారు. 23 బ్యాగుల్లో ఉన్న మొత్తం ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని భద్రత నిమిత్తం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు.
పీడీఎస్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిందితుడిపై 6-ఏ చట్టం కింద కేసుతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో డీటీసీఎస్‌ పోచయ్య, సీఐ రాజిరెడ్డి, ఈటీఎఫ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.