కుందుర్పి లో
కుందుర్పి: మండల కేంద్రంలో ఎంపీటీసీ సెగ్మెంట్-1 కూటమి అభ్యర్థి సజ్జల వెంకటేశులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు సోమవారం కుందుర్పి మండల కేంద్రంలోని కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కురుబ వీధి, బలిజ వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన సొంత నిధులతో కుందుర్పి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎంపీటీసీ సెగ్మెంట్-1 బీజేపీ కూటమి అభ్యర్థి సజ్జల వెంకటేశులుకు కమలం గుర్తుపై, టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి జి.ఎల్. ప్రభావతమ్మకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి స్పందన లభించిందని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయరంగస్వామి.