BREAKING
మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు *

Select Suryaa Now
పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా...   * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు *

పలాస, సూర్య : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా తీర్పును శిరసావహిస్తా..

ప్రజలు తమ భవిష్యత్తును తమ ఓటు ద్వారా నిర్ణయించుకున్నారని, వారు ఏ తీర్పు ఇచ్చినా దానిని శిరసావహిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని, తాను ఎల్లప్పుడూ ప్రజల తీర్పునకు కట్టుబడి ఉంటానని తెలిపారు. పట్టణ ప్రజలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఓటరుకు తన శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

నా ప్రాణసమానులైన కార్యకర్తలకు వందనం..

ఈ మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయని, అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ రెండూ హోరాహోరీగా తలపడ్డాయని అన్నారు. ఈ ఎన్నికల సంగ్రామంలో రాత్రింబవళ్లు కష్టపడి, వైసీపీ జెండాను భుజాన ఎత్తుకొని శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు, తన ప్రాణసమానులైన అభిమానులకు ఆయన వందనాలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల త్యాగం, అంకితభావం, తనపై వారు చూపిన నమ్మకం ఎన్నటికీ మరువలేనిదని, వారి కష్టానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.

పోలీసు, ఎన్నికల యంత్రాంగానికి అభినందనలు..

ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి కృషి చేసిన పోలీసు యంత్రాంగానికి, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా అహోరాత్రులు గస్తీ కాసి సహకరించిన పోలీసు సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఎన్నికల ప్రక్రియను నిష్పాక్షికంగా, జయప్రదంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి, యంత్రాంగానికి కూడా తన అభినందనలు తెలియజేశారు.

శ్వాస ఉన్నంత వరకు పలాస అభివృద్ధికే పోరాటం..

చివరగా పలాస పట్టణ అభివృద్ధి కోసం శ్వాస ఉన్నంత వరకు పోరాడుతానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.