*డా.వి.జె.ఇ.కారోలిన్ కు ఇండియన్ గ్లోరీ అవార్డ్*
ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో ప్రతిభను, సైకాలజీ రంగంలో అనుభవాన్ని గడించిన ప్రొఫెసర్ డా. వి.జె.ఇ.కారోలిన్ కు ఇండియన్ గ్లోరీ అవార్డ్ లభించింది. ప్రముఖ నటులు సుమన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ థియేటర్ లో ఈ అవార్డును బహుకరించారు. వందే భారత్ చిత్రాన్ని నిర్మించిన కళారత్న మూవీస్ సంస్థ, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అవార్డు బహుకరణ జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు మేడిది వెంకటేశ్వరరావు, సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు, వి ఎన్ ఆదిత్య, డైరెక్టర్ మల్లం రమేష్ తదితరులు హాజరయ్యారు. ప్రాధాన్యత గల ఇలాంటి అవార్డు వల్ల సమాజం పట్ల తనకు ఎంతో బాధ్యత పెరిగిందని డా. కారోలిన్ విలేకరులతో అన్నారు. ప్రస్తుతం ఈమె టి కె ఆర్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వందే భారత్ సినిమాలో దేశభక్తి ప్రాధాన్యత గల పాత్రలో నటించారు.