BREAKING
కేఎల్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త సమావేశం బొర్రాఅనిత గెలుపు.. మండల అభివృద్ధికి మలుపు గోమాత సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేటిసాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ స్థానిక ఎన్నికలు సర్వం సిద్ధం అంగన్‌వాడీ టీచర్ల హక్కుల సాధనకు బీఎంఎస్ నిరంతర కృషి -- నారాయణపేట జిల్లా అంగన్‌వాడీ టీచర్ల సంఘం నూతన కమిటీ ఏర్పాటు శ్రీనివాసరావుమాస్టర్ విజయం ఖాయం అమెరికాలో తెలంగాణ ప్రముఖుల కలయిక జీఎంఆర్‌కు ఆత్మీయ స్వాగతం కత్తర్ నుంచి స్వదేశానికి ఇద్దరు మహిళలు జగన్ద్వంద్వ వైఖరిపై గళ్ళా మాధవి ఆగ్రహం కరువు పరిస్థితులపై కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పరిశీలన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి -- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి -- 21వ రోజుకు చేరుకున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రచారంలో పాల్గొన్న కోనేటిపురం ఎంపీటీసీ అభ్యర్థి రత్నకుమారి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు వేడుకలు: భారీ అభిమాన సందడి మధ్య ‘కింగ్’ ప్రమోషన్స్ షురూ!

మహిళలు, విద్యార్థినులపై ఆకృత్యాలను అరికట్టాలి

Select Suryaa Now
మహిళలు, విద్యార్థినులపై ఆకృత్యాలను అరికట్టాలి

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలని, రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి అత్యాధునిక వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ ఎస్ ఎఫ్ ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ కూడలి వద్ద నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాప్తాడు ఘటన బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.