telangana
- సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే
సూర్య,లింగంపేట్ : సూర్య కథనానికి స్పందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ అన్నారని లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షలు,కాబోయే మండల కార్యదర్శి మాసుల శివయ్య తెలిపారు.సోమవారం హైదరాబాద్ కు లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసుల శివయ్య,ఎం.డి.సాజిద్ ఖాన్ లను పిలిపించుకొని పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులకు రాబోయే కాలంలో అన్ని విధాలా తగిన పదవులు ఇస్తానని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.అనంతరం మాసుల శివయ్యను లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా,సంగెపు వంశీకుమార్ ను పోల్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా నియమించాలని లింగంపేట్ మండల అధ్యక్షులు గోకుల్ సాయిరాం ను ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.దీంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే ను కలిసిన వారు పోల్కంపేట్ గ్రామానికి చెందిన మాసుల శివకుమార్,ఎం.డి.సాజిద్ ఖాన్,సంగెపు వంశీకుమార్ లు ఉన్నారు.