BREAKING
పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ 35వ వార్డులో ఉత్కంఠకు తెర.. రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!.. రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ 30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్

ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్

Select Suryaa Now
ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్

బంట్వారం, మేజర్ న్యూస్: వ్యవసాయంలో ఎదురైన నష్టాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతును బీఆర్ఎస్ నాయకుడు, అడ్వకేట్ మల్కాపురం చైతన్య కిరణ్ సోమవారం పరామర్శించారు. బంట్వారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామానికి చెందిన రైతు, బీఆర్ఎస్ కార్యకర్త రాజు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ప్రస్తుతం వికారాబాద్‌లోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న చైతన్య కిరణ్ ఆసుపత్రికి వెళ్లి రాజు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న రైతు కుటుంబానికి తనవంతుగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.ఈ సందర్భంగా చైతన్య కిరణ్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో నష్టాలు ఎదురైనప్పుడు రైతులు ధైర్యం కోల్పోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. రాజు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.