ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం, సూర్య : నగర పాలక సంస్థ పాలవర్గాన్ని ఎన్నుకునేందుకు జరిగిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు. మొత్తం 62 డివిజన్లకు, మేయర్ అభ్యర్థి కోసం జరిగిన ఓటింగ్ లో 1,39,929 ఓట్లు నమోదు అయిన విషయం తెలిసిందే. వాటికి లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఓట్లు లెక్కింపునకు వార్డుకు ఒక బ్లాక్ చొప్పున 62 బ్లాక్ లు ఏర్పాటు చేయడం జరిగింది. 62 బ్లాక్ లో మొదట ఓట్లు విభజన ప్రారంభం కానుంది. ఏ వార్డుకు ఏర్పాటు చేసిన బ్లాక్ లో ఆ వార్డు బ్యాలెట్ బాక్సులు రాజకీయ పార్టీల ఏజెంట్లు సమక్షంలో ఒక్కొకటిగా ఏజెంట్లకు చూపించి ఓట్లను బ్యాలెట్ బాక్సులు నుంచి బయటకు తీయ్యనున్నారు. ఏజెంట్లు సమక్షంలో ఓట్లు చూపించి మేయర్ అభ్యర్థి ఓట్లు, వార్డు సభ్యులు ఓట్లు వేరు చేయడం జరుగుతుంది. వేరు చేసిన ఓట్లు వేరే వేరే బాక్సుల్లో వేసిన తర్వాత వాటిని 25 చొప్పున కట్టలు కట్టి వార్డు సభ్యులు ఓట్లు వార్డు సభ్యులు కు కేటాయించిన బాక్సులో ,మేయర్ అభ్యర్ధులకు వేసిన ఓట్లు మేయర్ కు కేటాయించిన బాక్సులో వేయడం జరుగుతుంది. అనంతరం రెండో బ్లాక్ లో మేయర్ అభ్యర్ధులు ఓట్లు లెక్కింపు బ్లాక్ లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. మరో వైపు మొదటి 31 బ్లాక్ లో వార్డు సభ్యులు ఓట్లు వేరు చేసినవి లెక్కించడం జరుగుతుంది. మొదటి 31 డివిజన్లు కు సంబంధించిన ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది.ఆది అయిన తర్వాత 32 నుంచి 62 వార్డు సభ్యులు ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. వార్డు సభ్యులు లెక్కింపు ప్రక్రియ రెండు రౌండ్లలో జరిగేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. అనంతరం 32 నుంచి 62 వార్డులకు రెండో రౌండ్లో లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటలకు ఓట్లు వేరు చేయడం, కట్టలు కట్టడం జరుగుతుంది. మరో వైపు ఆయా అభ్యర్ధులు తరుపున లెక్కింపు కు వచ్చే ఏజెంట్లు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకొని రాకూడదు. సెల్ ఫోన్లు కు అనుమతి లేదు. ఎటువంటి ద్రవపదార్థాలు అనగా వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్లు వంటివి తీసుకురాకూడదని చెప్పారు.లెక్కింపు, ఫలితాలు త్వరితగతిన వెలువడే విధంగా సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ ఇవ్వడం జరిగిందని కమీషనర్ బాలస్వామి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు నాయకులు సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలలో ఉంటుందన్నారు. గుంపులుగా ఉండకూడదని ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే విధంగా అందరూ సహకరించాలని ఎన్నికల సహాయ అధికారి మరియు కమిషనర్ బాలస్వామి ఆయన కోరారు.