BREAKING
మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ *

Select Suryaa Now
వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ *

నరసన్నపేట, సూర్య : ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కార్మికులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కార్మిక సహాయ అధికారి జయశంకర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్, విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు. సోమవారం నరసన్నపేటలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని దుకాణాలు, సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, చిన్నతరహా ఉద్యోగులు ఎన్నికల రోజున పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల రోజున కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యాలు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు కల్పించాలని ఆదేశించారు. ఈ నిబంధనను ఉల్లంఘించి వేతనంతో కూడిన సెలవు ఇవ్వని యాజమాన్యాలపై కార్మిక శాఖ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా యాజమాన్యాలు ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు కల్పించకపోతే సంబంధిత కార్మికులు, ఉద్యోగులు వెంటనే నరసన్నపేట కార్మిక శాఖ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ కల్పించిన విలువైన హక్కు అని, కార్మికులు, ఉద్యోగులు ఎవరూ ఓటు వేయకుండా ఉండకూడదని జయశంకర్ స్పష్టం చేశారు.