BREAKING
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుందుర్పి లో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు 'గురురాజ' విద్యార్థి ఎంపిక

మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు.

Select Suryaa Now
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు.

కళ్యాణదుర్గం:  రూరల్ మండల పరిధిలోని మల్లిపల్లి గ్రామంలో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు యువ నాయకుడు దేవినేని అవినాష్ గ్రామంలో పర్యటించి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మల్లిపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న పరిణామం చోటుచేసుకుంది. దేవినేని అవినాష్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. సూర్యనారాయణ రావు, గొల్ల శ్రీనివాసులు, గొల్ల వెంకటేష్, ఊరుగొల్ల నాగార్జున, చాకలి తిప్పేస్వామి, గొల్ల శివలింగ, గొల్ల రాంబాబు, గొల్ల తిప్పేస్వామి, గొల్ల తిప్పన్న, మాదిగ ఎర్రిస్వామి, మాదిగ మల్లికార్జున టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని, పార్టీలకు అతీతంగా ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థుల విజయం అవసరమన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విశ్వసించి వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కుటుంబాలు టీడీపీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఎమ్మెల్యేకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు మరింత ఊతం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.