*టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి
విజయనగరం, సూర్య : జిల్లాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కూటమి పార్టీల మధ్య తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించి, పరస్పర సమన్వయంతో ముందుకు సాగేందుకు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ పాల్గొన్నారు.
జిల్లాలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఎదురవుతున్న సమస్యలు, సమన్వయ లోపాలు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. కూటమి పార్టీల మధ్య పరస్పర అవగాహన, సమన్వయం పెంపొందించుకోవాలని, స్థానికంగా తలెత్తే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవడంపై చర్చించారు.