BREAKING
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని.

Select Suryaa Now
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని.

**బ్రహ్మసముద్రం:** మండల కేంద్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తలారి పరమేశ్వరప్ప కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరై సందడి చేశారు. పరమేశ్వరప్ప కుమార్తె పూజ, తిప్పేస్వామి వివాహం అనంతరం నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నూతన దంపతులు పూజ, తిప్పేస్వామిలను ఆప్యాయంగా పలకరించి, పుష్పగుచ్ఛం అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీవితంలో అడుగుపెట్టిన దంపతులు పరస్పర అవగాహన, ప్రేమానురాగాలు, అన్యోన్యతతో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఎమ్మెల్యేను చూసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు వివాహ వేడుకకు విచ్చేసిన బంధువులు, స్నేహితులు, స్థానిక నాయకులను ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ శుభకార్యాల్లో పాల్గొని ఆత్మీయతను పంచుకోవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.