పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక!!
పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక!!
రామగిరి మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులు బాస్కెట్ బాల్ నందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అండర్ 19 బాలికల విభాగం నందు వి యశస్విని, డి. నైన మరియు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి బి యశ్వంత్ అండర్ 14 బాలుర విభాగం నందు హాకీ క్రీడలో రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం జరిగినది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద్ పేర్కొన్నారు .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి వారధి, పి నరేష్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం నందు పాఠశాల ఉపాధ్యాయులు బాలగుర్రప్ప, రవికుమార్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య