ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల నిరాహార దీక్ష సామ రామ్మోహన్ రెడ్డి మద్దతు
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు తమ హక్కులను కాపాడాలని సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. బ్యాంకు ఉద్యోగులకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మద్దతుగా పాల్గొని.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీరును ఖండించారు. ఐడీబీఐ బ్యాంక్ నష్టాల్లో ఉన్నప్పుడు, ఎల్ఐసీని భాగస్వామ్యం చేసిన కేంద్రం, ఇప్పుడు వరుస లాభాలతో ముందుకు సాగుతున్న ఐడీబీఐ బ్యాంక్ ను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. నిబంధనలు తుంగలో తొక్కి ఫెయిర్ ఫ్యాక్స్ సంస్థకు కారు చౌకగా కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.