ఓట్ బచావో దేశ్ బచావో...
*కడ్తాల్, రంగారెడ్డి జిల్లా :*
ఓట్ బచావో దేశ్ బచావో – చలో ఢిల్లీ రాంలీలా మైదాన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఢిల్లీలో ఉన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి గారిని *టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్* గారి ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు కలిశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్య నాయక్, ఆమనగల్ మండల పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ పుస్తకాల రాహుల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి లింగా రెడ్డి, కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ గణేష్ గౌడ్, తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షాబుద్దీన్, మాజీ ఎంపీటీసీ రఘువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అనిత విజయ్ నాయక్, INTUC జిల్లా అధ్యక్షులు ఎంగలి ప్రసాద్, సర్పంచ్ మల్లేష్ నాయక్, NSUI ఫరీద్, కేశవులు, మండ్లి రాములు, మాడ్గుల మండల నాయకులు కిషన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.