BREAKING
భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం జోరు వానలోనూ తగ్గని జోరు.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. ఆనందపురం జడ్పీటీసీకి చతుర్ముఖ పోరు...!! బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు.... కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం చిత్తూరు మండలంలో టిడిపి ఇంటింటి ప్రచారం - ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ * ఉపాధి హామీ పనిదినాలను125 నుంచి 225 రోజులకు పెంచాలి వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి ఏఐవైఫ్ నేటితో పరిషత్‌ ఎన్నికల ప్రచారానికి తెర.. * జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ * ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రన్నాయుడు సేవలు చిరస్మరణీయం

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

Select Suryaa Now
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి
పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలి
అధికారులకు అదనపు కలెక్టర్‌ కిరణ్మయి ఆదేశం

(రంగారెడ్డి - మేజర్ న్యూస్)  ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీకి ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిరణ్మయి (లోకల్‌ బాడీస్‌), చంద్రారెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజావాణికి మొత్తం 116 ఫిర్యాదులు అందగా, వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 67, ఇతర శాఖలకు సంబంధించి 49 అర్జీలు ఉన్నాయి. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.