telangana
మైనింగ్ స్టాఫ్ డిమాండ్లను పరిష్కరించాలి - వాసిరెడ్డి సీతారామయ్య
సూర్య నస్పూర్ : మైనింగ్ స్టాఫ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం వీడి తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి నస్పూర్ నరసయ్య భవన్‌లో నిర్వహించిన బెల్లంపల్లి రీజియన్ సంయుక్త మైనింగ్ స్టాఫ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడి 24 కీలక డిమాండ్లపై ఒప్పందాలు సాధించామని, వాటిని అమలు చేయడంలో యాజమాన్యం జాప్యం చేయడం తగదన్నారు.భూగర్భ గనుల్లో పనిచేయడానికి అనర్హులైన ఉద్యోగులకు ఒప్పందాల ప్రకారం ఉపరితల విభాగంలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఓవర్‌మెన్, జూనియర్ మైనింగ్ ఇంజినీర్ల పదోన్నతుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఉన్నత విద్య అభ్యసించే ఉద్యోగులకు ఎన్‌ఓసీలు జారీ చేయాలన్నారు. ఫస్ట్, సెకండ్ క్లాస్ మైనింగ్ సర్టిఫికెట్లు పొందిన ఉద్యోగులకు అర్హతల ఆధారంగా ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో పదోన్నతులు కల్పించాలని సూచించారు. మైనింగ్ స్టాఫ్
ఉద్యోగులను వారి అర్హతలు, విధులకు సంబంధంలేని పనులకు వినియోగించరాదన్నారు. జ్యూరిస్డిక్షన్ ఇన్‌స్పెక్టర్ల విధుల పరిధిని స్పష్టంగా నిర్ధారించాలని, వివిధ కారణాలతో నిలిపివేసిన ఇంక్రిమెంట్లను సమీక్షించి అర్హులకు తిరిగి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్హతలు కలిగిన కార్మికులకు మైనింగ్ సూపర్‌వైజరీ స్టాఫ్‌గా పనిచేసేందుకు అవసరమైన శిక్షణ, అవకాశాలు కల్పించాలని కోరారు.ఇప్పటికే కుదిరిన 24 కీలక ఒప్పందాలను పూర్తిస్థాయిలో అమలు చేసి, పెండింగ్ సమస్యలను కాలపరిమితితో పరిష్కరించాలని నాయకులు యాజమాన్యాన్ని కోరారు. ఉద్యోగుల హక్కులను కాపాడుతూ అర్హతలకు తగిన పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, మైనింగ్ స్టాఫ్ సెక్రటరీ రాజేశ్వరరావు, రీజియన్ సెక్రటరీ రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ అడ్డూ శ్రీనివాస్, ఏరియా సెక్రటరీ బాలకృష్ణ, జిల్లా సెక్రటరీ అప్రోజ్ ఖాన్, అధికార ప్రతినిధి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.