ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:
ఓట్ల దొంగతనం (ఓట్ చోరీ)కు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా అఖిల భారత కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజల తీర్పును గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఓట్ల దొంగతనం ఆరోపణలపై నిరసన తెలుపుతూ, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయనున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమానికి మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.