BREAKING
గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఓట్ బచావో దేశ్ బచావో... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

ఫిర్యాదులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ నగేష్

Select Suryaa Now
ఫిర్యాదులను  పరిష్కరించాలి:  అదనపు కలెక్టర్ నగేష్

మెదక్  ;  ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వాటిని  పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని  అదనపు కలెక్టర్  అధికారులను ఆదేశించారు.సోమవారం  కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ , డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్ లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని, సమస్యకు సంబంధించిన వివరాలను నిర్ధారించుకుని నిబంధనల మేరకు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.ఫిర్యాదుల పరిష్కారంలో అనవసర జాప్యం చేయకుండా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 62 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. అందులో భూ భారతి 25 ,ఇందిరమ్మ ఇండ్లు 12 ,పెన్షన్ 01,ఇతర 24 మొత్తం 62 అందాయన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.