BREAKING
చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది! విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

నఫీజ్ భాషాకు కేంద్ర హోంమంత్రి దక్షతా పతకం --జాతీయ స్థాయిలో గుర్తింపు.. --గుంటూరు రేంజ్ నుంచి ఎంపికైన ఏకైక అధికారి

Select Suryaa Now
నఫీజ్ భాషాకు కేంద్ర హోంమంత్రి దక్షతా పతకం --జాతీయ స్థాయిలో గుర్తింపు..  --గుంటూరు రేంజ్ నుంచి ఎంపికైన ఏకైక అధికారి

వేమూరు(భట్టిప్రోలు), మేజర్ న్యూస్: నియోజకవర్గ కేంద్రమైన వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ నఫీజ్ భాషా అరుదైన జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక 'కేంద్ర హోంమంత్రి దక్షతా పతకంలో, దేశవ్యాప్తంగా ఎంపికైన 123 మంది దర్యాప్తు అధికారుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం నలుగురు పోలీసు అధికారులు మాత్రమే ఎంపిక కాగా, వారిలో వేమూరు సీఐ షేక్ నఫీజ్ భాషా ఒకరు కావడం విశేషం. అంతేకాకుండా ఐదు జిల్లాలతో కూడిన గుంటూరు పోలీస్ రేంజ్ నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీసు అధికారిగా ఆయన నిలిచారు. గతంలోనూ విధి నిర్వహణలో నీతి, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన నఫీజ్ భాషా పలు జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. తాజాగా జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడం పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఉన్నత పోలీసు అధికారులు ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి పోలీసు శాఖకు మరింత గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు.