మంత్రి సీతక్కను కలిసిన స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ఆ శాఖ నూతన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన నవీన్ మిట్టల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. నవీన్ మిట్టల్‌కు మంత్రి సీతక్క అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.