BREAKING
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఓట్ బచావో దేశ్ బచావో... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి *మానసిక, శారీరక ఆరోగ్యమే విద్యార్థుల విజయానికి పునాది*

ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించాలి

Select Suryaa Now
ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టేందుకు యంత్రాంగం అన్ని విధాలా సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. సోమవారం న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలోని త‌న ఛాంబ‌ర్ లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, అధికారుల విధులు, బాధ్యతలు, ఎన్నికల నియమావళిపై అన్ని విభాగాల అధికారులతో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. ఎన్నికల విధులకు నియమితులైన ప్రతి అధికారి, ఉద్యోగి ఎన్నికల నియమ నిబంధనలు, విధివిధానాలు, తమకు కేటాయించిన బాధ్యతలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఈ సంద‌ర్భంగా సూచించారు. ఎలాంటి పొరపాట్లు, లోపాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా, సమన్వయంతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.  ఎన్నికల ముందస్తు ప్రణాళికలో భాగంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాల‌ను కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో నియమితులైన అధికారులు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి పూర్తి చేయాలని.. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెక్‌లిస్టుల ఆధారంగా ఎన్నికల సామాగ్రిని సక్రమంగా అందజేయాలని ఆదేశించారు.రూట్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌లను ముందుగానే పరిశీలించి, రవాణా మార్గాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని క‌మిష‌న‌ర్ సూచించారు. ఎన్నికల సిబ్బంది, సామాగ్రి రవాణాలో అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన బస్సులు, మినీ బస్సులు, ఇతర వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్‌చైర్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే మొత్తం 494 పోలింగ్ కేంద్రాల్లో అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించాల‌ని తెలిపారు. ఆయా కేంద్రాల్లో పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. 

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు, ఎన్నికల గుర్తుల కేటాయింపు, అవసరమైన అనుమతులు, ఎన్నికల ప్రచార వ్యయ నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. కావున ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, ఉద్యోగులు తమకు కేటాయించిన బాధ్యతలను ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని ఆదేశించారు. స‌మావేశంలో అద‌న‌పు క‌మిష‌న‌ర్ పి.వి.రామ‌లింగేశ్వ‌ర్, డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఎస్.వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న‌, ఈఈలు మ‌ద‌ర్సా అలీ, మాధ‌వి, డిప్యూటీ సిటీ ప్లాన‌ర్ నాయుడు, మేనేజ‌ర్ అబ్దుల్ మలిక్, అకౌంటెంట్ రామ‌స‌త్యం పాల్గొన్నారు.