BREAKING
బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు! బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల వేడి...ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఓటర్లు

*మానసిక, శారీరక ఆరోగ్యమే విద్యార్థుల విజయానికి పునాది*

Select Suryaa Now
*మానసిక, శారీరక ఆరోగ్యమే విద్యార్థుల విజయానికి పునాది*

*మధిర ప్రభుత్వ కళాశాల మున్సిపల్ డాక్టర్ రవీంద్రారెడ్డి*

*ప్రముఖ ఆయుర్వేద కన్సల్టెంట్ అనుసూరి శ్రీనివాసరావుచే  అవగాహన సదస్సు*

మధిర, సూర్య మేజర్ న్యూస్.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మరియు చదువులో రాణించడానికి మానసిక, శారీరక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పునాది అని మధిర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రవీంద్రారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సుకు ఆయుర్వేద కన్సల్టెంట్ అనుసూరి శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి: మంచి శారీరక ఆరోగ్యం మరియు తగినంత నిద్ర ఉండటం వల్ల చదువులపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు.పరీక్షల భయం, పోటీ ప్రపంచ ఒత్తిడిని తట్టుకోవడానికి మానసిక స్థైర్యం మరియు కౌన్సెలింగ్ సహాయపడతాయన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా ఉంటుందన్నారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి మానసిక ఆరోగ్యం ఎంతగానో దోహదపడుతుందన్నారు.ధ్యానం, సమయపాలన, క్రమశిక్షణ ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. అనంతరం ప్రముఖ ఆయుర్వేద కన్సల్టెంట్  శ్రీనివాసరావు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పరస్పరం అనుసంధానమై ఉంటాయని వివరించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర, వ్యాయామం, సానుకూల ఆలోచనా విధానం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేద ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం వివిధ రకాల ఆయుర్వేద ఔషధాలను పరిచయం చేసి, వాటి గురించి ప్రత్యక్ష ప్రదర్శన (డెమో) ఇచ్చారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.కార్యక్రమానంతరం అనుసూరి శ్రీనివాసరావు ని కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆయుర్వేద ఔషధ కో-ఆర్డినేటర్  పాములపాటి అనిల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్  జి. అరుణ, అధ్యాపకులు డా. ఎస్. ఇందిర, డా. పి. సుజాత, డా. వి. నాగరాజు, డా. ఎం.వి.ఎస్. శాస్త్రి, పి. లక్ష్మీనారాయణ, షేక్ ఇమ్రాన్, పిల్లి నాగేశ్వరరావు, ఎస్. జ్యోతి, పి. శ్రీనివాస్, టి. ఆదర్శ్, ఎస్.ఎస్. పృథ్వీరాజ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.