రూప్ కుమార్ యాదవ్‌కు 50 మార్కు సాధ్యమేనా?
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి సోదరుల ప్రచారం ఎంతవరకు బలాన్నిచ్చింది? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ విజయం, డివిజన్ల వారీగా పార్టీకి వచ్చే స్థానాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా 50 డివిజన్ల మార్కును టీడీపీ చేరుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు సిటీతో పోలిస్తే నెల్లూరు రూరల్ పరిధిలో రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా కోటంరెడ్డి సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిరంతరం ప్రచారం నిర్వహించారు. డివిజన్ డివిజన్‌కు వెళ్లి అభ్యర్థుల తరఫున ఓటర్లను కలుస్తూ పార్టీ విజయానికి కృషి చేశారు. ఈ ప్రచారం రూప్ కుమార్ యాదవ్‌కు ఎంతమేర బలాన్ని చేకూర్చింది? రూరల్‌లో వచ్చిన మద్దతు కార్పొరేషన్ మొత్తం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? 50 స్థానాల లక్ష్యాన్ని టీడీపీ చేరుకుంటుందా? అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.