BREAKING
చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది! విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

కౌంటింగ్ కేంద్రాలపై జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. పారదర్శకంగా, సమన్వయంతో ఓట్ల లెక్కింపు చేపట్టాలి

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రాలపై జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..  పారదర్శకంగా, సమన్వయంతో ఓట్ల లెక్కింపు చేపట్టాలి

(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ సోమవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి సీసీటీవీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు సమయపాలన పాటిస్తూ, సమన్వయంతో పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బ్యాలెట్ బాక్సుల తరలింపులో పూర్తి క్రమబద్ధత పాటించాలని, కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.అనంతరం తాడిపత్రి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కౌంటింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి, ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.ఈ తనిఖీల్లో డీపీఓ ఓంకార్, మున్సిపల్ ఇంజనీర్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు.