వేపులపర్తి ప్రభుత్వం ప్రచారం జోరు.. రంగయ్య పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే అమిలినేని.
బ్రహ్మాసముద్రం వేపులపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భారీ రోడ్‌షో నిర్వహించారు. కూటమి జడ్పీటీసీ అభ్యర్థి పాలబండ్ల శ్రీరాములు, ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చారు. గ్రామంలోని రంగనాథస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షోకు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ జనసందోహం, కార్యకర్తల నినాదాలతో గ్రామంలో ఎన్నికల ప్రచార వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి లభించిన స్పందనను చూసి ఓటమి భయంతో ఇంటికే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందలేక కులాల మధ్య చిచ్చుపెట్టి, గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్సార్‌సీపీ చూస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారశైలిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేశారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు నమ్మకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బీటీపీ పనులకు భూమిపూజ చేసి ప్రారంభిస్తే, అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు భూసేకరణ పరిహారం కూడా చెల్లించలేదని ఆరోపించారు. కళ్యాణదుర్గం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకురావాలనే లక్ష్యంతో తమ సంస్థ ద్వారా సుమారు రూ.9 నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసి నీటిని తీసుకొచ్చామని వెల్లడించారు. 2028 మార్చి నాటికి భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) పనులు పూర్తి చేసి ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించారని తెలిపారు. నియోజకవర్గంలోని 140 చెరువులను నీటితో నింపి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యమన్నారు. కృష్ణా జలాల రాకతో కళ్యాణదుర్గం ప్రాంతాన్ని గోదావరి జిల్లాలను తలపించేలా అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీటీపీ డ్యామ్ పరిసరాలను పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్ది స్థానికులకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వేపులపర్తి గ్రామ ప్రజలకు ప్రత్యేక కానుకగా తన సొంత నిధులు రూ.50 లక్షలతో కళ్యాణమంటపం నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గమనించి, తమ సంస్థ ఆధ్వర్యంలో తొమ్మిది, పది తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 7,500 సైకిళ్లు అందించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. కూటమి జడ్పీటీసీ అభ్యర్థి పాలబండ్ల శ్రీరాములుతో పాటు 12 మంది ఎంపీటీసీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అమిలినేని ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.