BREAKING
ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం..పీయూష్ గోయల్ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల జోరు నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మేయర్ కొలగాని శ్రీనివాస్ దక్షిణ కొరియాతో ముగిసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి నౌకాదళ విన్యాసాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు–2026: పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి. యువ ఆపద మిత్ర శిక్షణలో శాతవాహన కామర్స్ వాలంటీర్లు పశ్చిమ బెంగాల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పోశమ్మ తల్లికి బోనం.. ఉద్యోగ భద్రత కోసం వేడుకోలు -22వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె. - ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు అనూహ్యంగా ఘన విజయం సాధించిన జనసేన శిరీష పాలకొల్లును ముంచెత్తిన వర్షపు నీరు! లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.. ప్రధాన రహదారులపై నిలిచిన మోకాళ్ల లోతు నీరు ప్రజా సౌకర్యార్థం ఆర్టీసీ స్టాప్ ఏర్పాటు చేయాలి విజయం సాధిస్తా - అభివృద్ధి చేసి చూపిస్తా జీఎం దిగుమతులకు ఎలాంటి అనుమతి లేదు: పీయూష్ గోయల్

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయభేరి!

Select Suryaa Now
 నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయభేరి!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    

 6వ డివిజన్‌లో జనసేన జెండా రెపరెపలు!
 471 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం! 

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో జనసేన పార్టీ అభ్యర్థి, మన నాయకుడు శ్రీ బత్తుల శ్రీకాంత్   6వ డివిజన్ నుంచి 471 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించడం ఎంతో ఆనందదాయకం, గర్వకారణం.  ఈ విజయం కేవలం ఒక అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు… జనసేన పార్టీ సిద్ధాంతాలపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్   నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం.  ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన ప్రతి జనసైనికుడికి, వీర మహిళకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ముఖ్యంగా 6వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.  ఎన్నికల ప్రచారంలో ఎండనక, వాననక అహర్నిశలు శ్రమించి పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు.   ఘనవిజయం సాధించిన శ్రీ బత్తుల శ్రీకాంత్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు! ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, 6వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ, మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలకు ఈ విజయం నాంది కావాలని ఆకాంక్షిస్తున్నాం.  జనసేన విజయ పరంపర కొనసాగాలి!