telangana
ప్రజా సౌకర్యార్థం ఆర్టీసీ స్టాప్ ఏర్పాటు చేయాలి
సూర్య కొడిమ్యాల ;మండల కేంద్రంలోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆర్టీసీ బస్సులు ఆగేందుకు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, ఉద్యోగులు, ప్రయాణికులు బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్సులు ఎక్కేందుకు ప్రధాన బస్టాండ్‌కు వెళ్లాల్సి వస్తుండటంతో సమయం వృథా అవుతోందన్నారు. ప్రజల సౌకర్యార్థం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్‌ను కోరారు.