ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి ప్రజావాణికి 68 దరఖాస్తులు .
సంగారెడ్డి, - ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తుల విషయంలో అధికారులు అలసత్వం వహించరాదని అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ధరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తుంటారని, వారి సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని సూచించారు .ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 68 దరఖాస్తులు అందాయి. వీటిలో సంగారెడ్డి 21, నారాయణఖేడ్ 3, జహీరాబాద్ 2, సంగారెడ్డి కలెక్టరేట్‌లో 42 దరఖాస్తులు వచ్చాయి. అందోల్ డివిజన్‌కు ఎలాంటి వినతులు అందలేదని అధికారులు వెల్లడించారు . వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి ప్రజావాణికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి , సోషల్ వెల్ఫీర్ డి డి అఖిలేష్ రెడ్డి , జిల్లా బి సి సంక్షేమాధికారి జగదీష్ , జిల్లా సంక్షేమాధికారిణి లలితా కుమారి ,జిల్లా వైద్యాధికారిణి లలిత దేవి ,డి ఏ హెచ్ ఓ వసంతకుమారి ,అడ్వొకేట్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.