BREAKING
ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటేయండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రామాయణానికి తెలుగు మాటలు రాయడం నా అదృష్టం: రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ 191 పరుగులకే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగింపు.. మిల్నే దెబ్బకు భారత్‌ 191/8 సరోగసి నేపథ్యంలో భావోద్వేగాల హారం: ఓటీటీలోకి వచ్చిన 'వరం డి/ఓ భార్గవి' సినిమా 16వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మేయర్ దంపతులు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన ఇషాన్ కిషన్: రెండు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన వికెట్ కీపర్ ఇండియా ఏ జట్టు భారీ స్కోరు: సెంచరీతో మెరిసిన ధ్రువ్ జురెల్, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆకాశ్ దీప్ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి రోహిత్ శర్మ: 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా 'హిట్ మ్యాన్' కీలక నిర్ణయం పోలింగ్ సరళి ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన చీరాలలో డబ్బులు పంపిణీ చేస్తూ వైసీపీ కార్యకర్త అరెస్ట్ టెస్టు క్రికెట్‌లో సంచలనం సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా: రోహిత్ శర్మ రికార్డు బద్దలు తుడుకూర్తి గ్రామంలోని కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ముప్పు: బ్యాటింగ్‌లో విఫలమవుతున్న టీమిండియా సారథిపై పెరుగుతున్న విమర్శలు

వణుకుతున్న తీర ప్రాంతాలు..

Select Suryaa Now
వణుకుతున్న తీర ప్రాంతాలు..

అమరావతి :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ తుఫానుకు 'మురసు' అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది గంటకు 20 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తూ ఏపీ తీర ప్రాంతాలను వణికిస్తోంది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఇది రేపటికి (సోమవారం) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత పుంజుకుని తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. అనంతరం నవంబర్ 3న (ఎల్లుండి) ఉదయం నెల్లూరు - నరసాపురం మధ్య తీరాన్ని దాటే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడటంతో పాటు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల చొప్పున తీవ్రమైన గాలులు వీచే ప్రమాదం ఉంది.

ఈ ముప్పు దృష్ట్యా దక్షిణ కోస్తా, తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.