పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ
పులివెందుల, సూర్య ప్రతినిధి :పోలీసులే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, అందుకు పులివెందులలో జరుగుతున్న ఘటనలే ప్రత్యక్ష నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో మొత్తం 80 పోలింగ్ బూతులు ఉంటే, అందులో 70 బూతుల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేశారని ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారని, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను పోలీసులే అడ్డుకుని వెనక్కి పంపించేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల చేతిలోని స్లిప్‌లను కూడా లాగేసుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీకి పోలీసు వ్యవస్థ పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.