బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల పరామర్శ
అనంతపురం బ్యూరో : బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థినికి సంబంధించిన విషయంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) బెంగళూరుకు వెళ్లి విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించారు.
విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య చికిత్స వివరాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.