BREAKING
అల్లు అర్జున్ - అట్లీ 'రాకా' చిత్రంలో భారీ ఇంటర్వెల్ ఫైట్: హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మరింత అభివృద్ధి చేస్తాం వరుస వికెట్లతో భారత్‌కు షాక్.. 14 ఓవర్లలో 134/5 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ 'RC17' మూవీ లాంఛనంగా ప్రారంభం: పూజా కార్యక్రమంలో మెగా అభిమానుల సందడి ఓటీటీలోకి వచ్చేసిన 'అనకాపల్లి' సినిమా: సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ఖరారు రానా వినూత్న హారర్ ప్రాజెక్ట్: కంగనా రనౌత్ హీరోయిన్‌గా రవిబాబు దర్శకత్వంలో 'స్కారీ పిక్చర్' ఆర్‌జీవీకి 29.67 కోట్ల లీగల్ నోటీసు: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ సంచలన హెచ్చరిక ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల పరామర్శ వైసిపి ఆటలు సాగనివ్వం పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ వణుకుతున్న తీర ప్రాంతాలు.. న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొడుతున్న ఇషాన్-శ్రేయస్.. 10 ఓవర్లలో భారత్ 111/2 చెన్నై అపోలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు........... డాక్టర్ సెంథిల్ కుమార్

సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

Select Suryaa Now
సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి.  - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

 

 సూర్య, నస్పూర్ : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు పూర్వీకుల సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో సీతారాంపల్లి గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 9వ డివిజన్‌ సీతారాంపల్లిలో ఆదివారం నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల కొలుపు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు, మేయర్ ధర్ని మధుకర్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల ప్రజలందరూ ఒకచోట చేరి ఆధ్యాత్మిక భావనతో పాటు పరస్పర అనుబంధాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో, స్థానిక కార్పొరేటర్‌ సురిమిల్ల సౌమ్య, గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.