ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ సందర్భంగా మునీరుద్దీన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునీరుద్దీన్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహానాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిత్తరి ప్రభాకర్ అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి నక్కమల లక్ష్మీనారాయణ జగిత్యాల పట్టణం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కంటి అంజయ్య సుంకరపల్లి అశోక్ అంబేద్కర్ సీనియర్ నాయకులు దోమల గంగారం, గుడిసెల అశోక్, తన్నీరు నారాయణ, పులి గోవర్ధన్, రుద్ర మనోహర్ పాల్గొన్నారు