చెన్నై అపోలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు........... డాక్టర్ సెంథిల్ కుమార్
అపోలోలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు
తిరుపతి రాయలసీమ ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలు
అపోలో డాక్టర్లచే క్యాన్సర్ పై వైద్య సలహాలు
అపోలో విజయవంతంగా క్యాన్సర్ కు శస్త్ర చికిత్సలు
ప్రతినెల మూడవ బుధవారం తిరుపతి అపోలోలో సేవలు
తిరుపతి వైద్యం, మేజర్ న్యూస్: అంతర్జాతీయ ప్రమాణాలతో అపోలోలో క్యాన్సర్ కు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని చెన్నై అపోలో ప్రముఖ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సెంథిల్ కుమార్ తెలిపారు. నగరంలోని తుడా రోడ్డులోని అపోలో హాస్పిటల్ సమాచార కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ అపోలో రోబోటిక్ సర్జరీలతో క్యాన్సర్ కు శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్న ఆయన తెలిపారు. రాయలసీమ ప్రజల కోసం క్యాన్సర్ వైద్య సేవలు మరింత దగ్గర చేయాలని ఉద్దేశంతో తిరుపతి అపోలో సమాచార కేంద్రంలో ప్రతి నెల మూడో బుధవారం వైద్యుల అందుబాటులో ఉంటారని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులో ఉండడంతో మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇప్పటికే చెన్నై అపోలో చికిత్స పొందిన రోగులకు ఫాలో అప్ పరీక్షలు నిర్వహించడంతోపాటు కొత్తగా క్యాన్సర్ అనుమానాలు ఉన్న వారికి వైద్య సలహాలు పరీక్షలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. తల నుంచి కాళ్ల వరకు చెన్నై అపోలో హాస్పిటల్ లో క్యాన్సర్లకు ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీ విధానాల్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మూత్రపిండాలు థైరాయిడ్ రొమ్ము తదితరు భాగాలకు సంబంధించి క్యాన్సర్లతో పాటు క్లిష్టమైన కేసుల్లో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్సలు నిర్వహిస్తున్న మరి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్ చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స ఫలితాలు వస్తాయని తెలిపారు. శరీరంలో అసాధారణ మార్పులు కనిపించిన క్యాన్సర్ పై ఎలాంటి అనుమానాలు కలిగిన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సెంథిల్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అపోలో సమాచారం కేంద్రం పిఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.